అత్యంత రహస్యంగా ఏఆర్ రెహమాన్ కుమార్తె నిశ్చితార్ధం,

-

ఏఆర్‌ రెహమాన్‌.. ఈ పేరు తెలియని వారుండరు. అరుదైన ఆస్కార్‌ అవార్డును గెలుచుకుని… సంగీత దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఏఆర్‌ రెహమాన్‌. అయితే.. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌… ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌ కు ఎంగేజ్‌ మెంట్‌ జరిగింది. వరుడు పేరు రియా సిద్దీన్‌ షేక్‌ మహమ్మద్‌.

ఖతీజా రెహమాన్‌ – రియా సిద్దీన్‌ షేక్‌ మహమ్మద్‌ డిసెంబర్‌ 29 వ తేదీన నిశ్చితార్థం చెన్నైలో జరిగింది. కాగా.. ఈ విషయాన్ని ఖతీజా తన సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా.. ప్రకటించింది. ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఖతీజా పోస్ట్‌ చేసిన ఎంగేజ్‌ మెంట్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఇక రియా సిద్దీన్‌ షేక్‌ మహమ్మద్‌ ఇంజినీర్‌, ఎంటర్‌ ప్రెన్యూర్‌ అని సమాచారం అందుతోంది. అయితే.. ఇప్పటి వరకు వివాహం ముహుర్తం మాత్రం నిర్ణయం కాలేదని సమాచారం అందుతోంది. మార్చిలో జరిగే చాన్స్‌ ఉందని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news