అబ్బాయిలకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన అమ్మాయిలు.

-

దేశంలో లింగ అసమానతల నుంచి మెల్లిమెల్లిగా మెరుగవుతోంది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు సరైన సంఖ్యలో అమ్మాయిలు ఉండేవారు కాదు. వారి సంఖ్య 980 కన్నా తక్కువగానే ఉండేది. దీంతో చాలా మంది అబ్బాయిలు బ్రహ్మచారులుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో గర్భ నిర్థారణ సమయంలో ఆడపిల్లలు అని తెలిస్తే అబార్షన్లు చేయించిన ఘటనలు చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం అలాంటి ఘటన చాలా వరకు తగ్గాయి. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా ఒకటే అనుకుంటున్నారు దంపతులు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ గుడ్ న్యూస్ అబ్బాయిలకు ఊరటనిచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తేలింది. నాలుగేళ్లతో పోలిస్తే ప్రస్తుతం జెండర్ రేషియాలో గణనీయంగా మార్పు చోటుచేసుకుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 2 శాతం అధికంగా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలిస్తే ఇది 4.5 శాతం అధికంగా ఉంది.  2015-16 సంవత్సరంలో ప్రతీ వెయ్యి మంది అబ్బాయిలకు 1021 మంది అమ్మాయిలు ఉండగా.. 2019-20 లో ఆ సంఖ్య 1045కు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 1055 గా ఉంది. జెండర్ రేషియాలో అమ్మాయిల సంఖ్య పెరగడం చాలా ఊరట కలిగించే అంశం.

Read more RELATED
Recommended to you

Latest news