నిరుద్యోగులకు గుడ్ న్యూస్… విశాఖలో జాబ్ మేళా..!

-

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గుడ్ న్యూస్ ని చెప్పింది. ఈ నెల 4వ తేదీన విశాఖలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. కొత్త సంవత్సరంలో స్కిల్‌ కనెక్ట్ డ్రైవ్‌ను ఈ సంస్థ నిర్వహించడానికి రెడీ అయ్యింది. అయితే ఈ జాబ్ మేళాకి నాలుగు కంపెనీలు వస్తున్నాయి. భారీ సంఖ్యలో పోస్టులని భర్తీ చేయనున్నారు.

ఇందులో పేటీఎమ్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నారు. వయస్సు 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే ఐటీఐ మోటార్ మెకానికల్, డిప్లొమా ఇన్ మెకానికల్ చదివిన వాళ్లు జయభేరి ఆటోమోటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో పని చెయ్యచ్చు. వారి వయస్సు వచ్చేసి 19 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

అలానే పాత్ర కంపెనీలో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు కూడా వున్నాయి. ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ & మూడేళ్ల డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్ వేర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు వున్నాయి.

వీటికి అయితే బీటెక్, ఎంసీఏ, పీజీ, ఎంబీఏ చదివిన అభ్యర్థులు అర్హులు. విశాఖపట్నంలోని పెందుర్తిలో ఈ జాబ్ మేళా జరగనుంది. పూర్తి వివరాలని మీరు ఈ కింది వెబ్ సైట్ ద్వారా చూసి తెలుసుకోచ్చు https://www.apssdc.in/home/jobsbyjobmelaid/1848.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news