ఫ్యాక్ట్ చెక్: కేవలం భారతదేశంలోనే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారా..?

-

మహమ్మారి కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయితే అన్ని దేశాలలో కూడా కరోనా మహమ్మారిని బారిన పడకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే భారత దేశంలో 40 కోట్లకు మందికి పైగా వ్యాక్సిన్ ని తీసుకోవడం జరిగింది.

అయితే భారతీయ జనతా పార్టీ నుండి ప్రమోద్ స్వామి తాజాగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో మాత్రమే వ్యాక్సిన్ ని ఫ్రీగా ఇస్తున్నారని చెప్పారు. ఆ ట్వీట్ లో అన్ని వ్యాక్సిన్స్ ధరలు కూడా అతను రాయడం జరిగింది.

వ్యాక్సిన్ కంపెనీల పేర్లతో సైతం వీటిలో తెలిపారు. అయితే నిజంగా కేవలం భారతదేశం మాత్రమే ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తుందా..? మరి ఏ ఇతర దేశాలు కూడా ఫ్రీగా వ్యాక్సిన్ ని ఇవ్వలేదా…? దీనిలో నిజమెంత అనేది చూస్తే… ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

కేవలం భారతదేశం మాత్రమే కాకుండా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ కూడా తమ ప్రజలకి ఫ్రీగా వ్యాక్సిన్ ని ఇస్తున్నారు. 2800 రూపాయలకి ఫైజర్ వాక్సిన్ ఇస్తున్నారని., 2715 రూపాయలకి సినో ఫార్మ్ ఇస్తున్నారని ఇలా వాక్సిన్ పేర్లు మరియు రేట్లు ఆయన తెలిపారు.

ఈ వార్త విపరీతంగా వైరల్ అయిపోతుంది. అయితే భారతదేశంలో మాత్రమే కాకుండా యునైటెడ్ కింగ్డంలో ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. మెక్సికోలో కూడా కరోనా వ్యాక్సిన్ ని డిసెంబర్ 2020 నుండి ఫ్రీగా ఇస్తున్నారు. చైనాలో కూడా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా వాక్సిన్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news