కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయా..? అయితే ఈ పద్ధతులని అనుసరించండి..!

-

సాధారణంగా ఏడవడం సహజం. కానీ కళ్ళల్లో నుంచి ఎక్కువగా నీళ్లు రావడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత మంది మాత్రం తరచూ ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. మీకు కూడా కళ్ళల్లోంచి ఎక్కువగా నీళ్లు వస్తూ ఉంటాయా..? ఈ సమస్య నుండి బయట పడాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం కొన్ని టిప్స్. ఈ టిప్స్ ని కనుక మీరు ఫాలో అయితే కంటి నుండి నీళ్ళు కారకుండా ఉంటాయి. అయితే మరి ఆలస్యం లేకుండా ఈ టిప్స్ గురించి చూద్దాం.

 

క్యారెట్ జ్యూస్:

క్యారెట్ జ్యూస్ కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే చాలా సమస్యలను తొలగిస్తుంది కూడా. కంటి ఆరోగ్యం కోసం క్యారెట్ జ్యూస్ ను తీసుకోండి. దీంతో కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కంటి నుండి నీళ్లు కారవు. కాబట్టి క్యారెట్ జ్యూస్ ని మర్చిపోకుండా డైట్ లో తీసుకుంటూ ఉండండి.

కీరదోస:

కంటి ఆరోగ్యానికి కీర దోస కూడా ఎంతో మేలు చేస్తుంది. కళ్ళలో నుండి నీళ్ళు కారుతూ ఉంటే కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. చల్లటి కీరా ముక్కల్ని ఐదు నిమిషాల పాటు కంటి మీద పెట్టుకుని రిలాక్స్ గా ఉండండి. ఇలా చేయడం వల్ల ఎంతో రిలీఫ్ ఉంటుంది.

రోజ్ వాటర్:

రోజ్ వాటర్ కూడా కంటి ఇన్ఫెక్షన్స్ ను తొలగిస్తుంది. అలానే అలర్జీలు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి రోజ్ వాటర్ ని కూడా మీరు ఉపయోగించవచ్చు. కొంచెం రోజ్ వాటర్ ని తీసుకుని అందులో నీళ్ళు కలిపి కాటన్ ప్యాడ్ తో కంటి మీద అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. అలానే కళ్ల నుండి నీళ్లు కారడం కూడా తగ్గుతాయి,

Read more RELATED
Recommended to you

Latest news