కరీంనగర్ బీఆర్ఎస్‌కు పుట్టినిల్లు : హరీష్ రావు

-

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతుగా కరీంనగర్‌లో రోడ్ షోలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…కరీంనగర్‌లో చదువుకున్న విద్యార్ధి నేను అని గుర్తు చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్‌కు పుట్టినిల్లు అని అన్నారు.బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి చూస్తే నా రెండు  కళ్ళు సరిపోతలేవు అని ఆనందం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రైల్వే లైన్ మంజూరైంది.. వినోదన్న జాతీయ రహదారి సాధించారుఅని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్లే బండి  సంజయ్ గెలిచాడు.ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదు అని విమర్శించారు. వినోదన్న ఓడిపోయినా కరీంనగర్ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశారు అని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదు.. నవోదయ విద్యాయాలు ఇవ్వలేదు.. మెడికల్ కాలేజీ అడిగితే మొండిచేయి చూపించారు అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి.. పదేళ్లలో బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పండి అని ప్రశ్నించారు. కరీంనగర్‌కు నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు తెచ్చింది బీఆర్ఎస్ అని ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీ వాళ్లు ఇంటికో క్యాలెండర్, చిత్రపటాలు పంచుతున్నారు.. అవి కడుపు నింపుతాయా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news