కరోనా లాక్ డౌన్ తో గత నెల నుంచి ఒక్క రైలు కూడా కదలడం లేదు. కేవలం గూడ్స్ రైలు సర్వీసులను మాత్రమే కేంద్రం నడిపిస్తుంది గాని ప్రజా రవాణా కు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదు. ఈ తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలోనే రైళ్ళను అనుమతించే విషయమై కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. దీనిపై కేబినేట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
త్వరలోనే దీనిపై నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. వలస కార్మికుల కోసం ముందు రైళ్ళను ఓపెన్ చెయ్యాలని కేంద్ర సర్కార్ ఆలోచిస్తుంది. వేలాది మంది రోడ్ల మీద నడిచి రావడం దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం వంటివి కూడా జరిగాయి. ఒకవేళ లాక్ డౌన్ ని పెంచే ఆలోచన ఉంటే మాత్రం ముందుగా వాళ్ళను తమ సొంత ఊర్లకు తరలించే ఏర్పాటు చెయ్యాలని భావిస్తుంది.
లేకపోతే ఆకలి కేకలు పెరిగే సూచనలు ఉన్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో గత నలభై రోజులుగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, వారి కుటుంబీకులను తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లి పోవచ్చని చెప్పింది. అయితే వారు అందరూ కూడా బస్సుల్లోనే వెళ్తున్నారు. కొంత మందికి ఆ సదుపాయం లేక నడిచి వెళ్తున్నారు. మార్గ మధ్యలో కొందరు మరణిస్తున్నారు కూడా. అందుకే రైలు మార్గంలోనే తరలించాలి అని భావిస్తున్నారు.