అర్నబ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా…? ఈ మూడు ఛాన్స్ లే ఉన్నాయి…!

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో అరెస్టయిన తరువాత అతన్ని నవంబర్ 18 వరకు రిమాండ్‌ కు తరలించారు. అతని కస్టడీ మరియు బెయిల్‌కు సంబంధించి అవకాశాలు ఒకసారి చూస్తే…What is the suicide case in which Republic TV's Arnab Goswami has been arrested by Maharashtra Police? | Explained News,The Indian Express

మొదటి అవకాశం

ఈ కేసులో మరో ఇద్దరు నిందితులతో పాటు గోస్వామిని కస్టడీకి పొందడానికి పోలీసులు సెషన్స్ కోర్టుకు వెళ్ళవచ్చు. ఒకవేళ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తే, గోస్వామి బెయిల్ పిటిషన్‌ ను మేజిస్ట్రేట్ విచారిస్తారు.

రెండవ అవకాశం

మేజిస్ట్రేట్ అతనికి బెయిల్ ఇవ్వకపోతే, గోస్వామి దాని కోసం సెషన్స్ కోర్టును మరియు తరువాత బాంబే హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది.

మూడవ అవకాశం

ఈ కేసును రద్దు చేయమని గోస్వామి పిటిషన్‌ ను గురువారం విచారించనున్న హైకోర్టు దానిని అంగీకరిస్తే… అతనిపై, ఇతర నిందితులపై ఎటువంటి కేసు ఉండదు.