మోసం చేసినోడికి ఉద్యోగం ఇచ్చిన సోనూ సూద్ !

-

ఈ లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాల కంటే సోనూ సూద్ ఎక్కువ సహాయం చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముందు తన ఇంటి చుట్టు పక్కల ఉన్న మైగ్రేట్ లేబర్ ని ఇళ్లకు చేర్చడంతో మొదలుపెట్టిన ఈ సహాయ కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చదువుకి ఇబ్బంది ఉన్న వారికి పుస్తకాలు, ల్యాప్ టాప్ లు, హాస్పిటల్ ఖర్చులు ఇబ్బందుల్లో ఉన్న వారికి హాస్పిటల్ ఖర్చులు చెల్లిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. అయితే తన పేరు చెప్పుకొని మోసం చేసిన ఒక వ్యక్తి కూడా ఆయన ఉద్యోగం ఇచ్చాడంటే ఆయన గొప్ప మనసు అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో ఈ ఆసక్తికర అంశం అని పంచుకున్నాడు సోను. అదేంటంటే సోనూసూద్ మేనేజర్ ని అని చెప్పి ఒక వ్యక్తి సోనుసూద్ చేత డబ్బులు ఇప్పిస్తానని దానికి 750 రూపాయలు లంచం ఇవ్వాలని బాదితుల నుండి కోరాడట. అయితే ఈ విషయం సోనూసూద్ చెవిన పడడంతో ఆయనే స్వయంగా ఆ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాడు. తాను సోనిని మాట్లాడుతున్నానని తన సహాయం కోరి వచ్చారంటే వాడు ఎంతో ఇబ్బంది పడితే తప్ప రారని అలాంటి వారి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం తప్పు అని చెప్పాడు. అలానే ఇక మీదట మంచిగా బతకాలని భావిస్తే ముంబై వచ్చి తన వద్ద పని చేయమని కోరాడట. దానికి సంతోషంగా ఒప్పుకున్న సదరు వ్యక్తి ముంబయి వచ్చి సోనూసూద్ వద్ద పనికి కూడా చేరాడట.

Read more RELATED
Recommended to you

Latest news