ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ఇప్పుడు అన్ని దేశాలు జాగ్రత్తలు పడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఇప్పుడు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. బుదవార౦ ఉదయం ఇరాన్ లో ఉక్రెయిన్ విమానం కుప్ప కూలింది. అసలు ఆ విమానం ఎలా కుప్ప కూలింది అనేది తెలియకపోయినా క్షిపణి దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపధ్యంలో పశ్చిమ ఆసియా దేశాల మీదుగా వెళ్ళే విమానాలను పలు దేశాలు రద్దు చేసాయి. యునైటెడ్ అరబ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్తల నేపధ్యంలో బాగ్దాద్‌కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ‘ఎమిరేట్స్ విమానాలు దుబాయ్ నుండి బాగ్దాద్ కు EK 943 మరియు జనవరి 8 న బాగ్దాద్ నుండి దుబాయ్ వెళ్లే విమాన EK 944 కొన్ని కారణాల వల్ల రద్దు చేయబడ్డాయి’ అని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ నేపధ్యంలో భారత్ సహా పలు దేశాలు మధ్య ప్రాచ్యం గగన తలం మీద ఎగిరే విమానాలను దారి మళ్ళించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే చైనా సహా పలు దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ గగనతల౦ మీద ఎగిరే విమానాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా సైనికులపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే.