ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఫోటో క్లిక్ మనిపిస్తున్నారు. ఫోటో తీయడం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఎక్కువ లైక్స్ కోసం ప్రయత్నాలు చేయడం. ముఖ్యంగా యువకులు దీనికి ఎక్కువగా ఆకర్షితులు అయ్యారు. ఫోటోల మీద పిచ్చి ఉన్న వాళ్ళు అయితే అందమైన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాగే చేస్తున్నాడు తమిళనాడు వెల్లూరుకి చెందిన శశి.
20 ఏళ్ళ ఈ యువకుడు తీసే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక పురుగు కనపడితే దాన్ని తన ఫోన్ లో బంధించాలి అని చూసాడు. ఎన్ని సార్లు తీస్తున్నా సరే కెమెరాను దాని దగ్గరకు తీసుకెళ్లగానే ఫోకస్ అవుటై పోతుంది. జిడ్డుగా, పిక్సలేట్ అవుతూ కనపడటం, ఫొటో బ్లర్ అవడంతో… ఫోన్ కి ఉన్న చిన్న కెమేరాతో ఫోటోలు చిన్న చిన్న వాటిని తీయలేమని గుర్తించాడు.
ఇంటర్నెట్‌లో చదివి, తన ఫోన్‌కి లెన్స్ సెట్ చేసుకొని, అలాంటివి తీయడం మొదలుపెట్టాడు. వెంటనే లెన్స్ తెప్పించుకుని, ఈగలు, దోమలు, పురుగులు, చీమలు వంటి ఎన్నో కీటకాల్ని అత్యంత దగ్గరగా, జూమ్ చేసి ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. దీనితో కీటకాలు సరికొత్తగా కనపడుతున్నాయి. అతను ఈగను ఫోటో తీసినా ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. ఇప్పుడు అతను తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
20 yr old, Sasi, from Vellore has clicked these pics with his phone and a lens. Amazing jugaad. pic.twitter.com/W7FGBDZK4V
— Gabbbar (@GabbbarSingh) January 17, 2020