ఎసిడిటీ ఉందని పాలు తాగుతున్నారా..? అయితే దీన్ని మీరు తప్పక తెలుసుకోవాలి..!

-

చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడతారు. ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలలో ఎసిడిటీ కూడా ఒకటి. ఎసిడిటీ తో బాధపడుతూ ఉంటారు చాలా మంది. అయితే మీరు కూడా ఈ సమస్య తో బాధపడుతున్నారా అయితే తప్పక ఈ విషయాలని చూడాలి చాలా మంది ఎసిడిటీ ఉందని పాలని తీసుకుంటూ ఉంటారు. పాలు తాగితే ఎసిడిటీ దూరమవుతుందా..? ఎసిడిటీ నుండి రిలీఫ్ ని పొందచ్చా అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఎసిడిటీ నుండి ఉపశమనం లభించాలని చాలామంది పాలని తీసుకుంటూ ఉంటారు. గుండెలో మంటగా ఉంటే చల్లని పాలు తాగితే చక్కటి రిలీఫ్ ని పొందచ్చని భావిస్తారు. నిజానికి ఎసిడిటీకి ఇది మంచి ఔషధం అని చెప్పొచ్చు. అయితే ఇది పూర్తిగా మీకు పరిష్కారాన్ని చూపదు. తాత్కాలిక ఉపశమనం మాత్రమే పాల ద్వారా మీకు లభిస్తుంది. పైగా పాలలో కొవ్వు ప్రోటీన్లు ఉంటాయి ఈ కారణంగా కడుపులో ఆసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది స్పీడ్ గా మారుతుంది.

అలానే ఆమ్లత్వ లక్షణాలని కూడా పెంచుతుంది. ఎసిడిటీ కోసం పాలు తాగితే ఆసిడ్ రిఫ్లెక్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాతిలో గొంతులో మంట వస్తుంది. ఎసిడిటీ ఉంటే పాలకు బదులుగా మీరు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే తక్షణ రిలీఫ్ ని పొందొచ్చు. ఛమోలీ టీ లేదంటే అల్లం, తులసి ఆకులు తీసుకున్న కూడా రిలీఫ్ పొందొచ్చు. అరటి పండ్లు కూడా రిలీఫ్ ని ఇస్తాయి. ఇలా ఉపశమనాన్ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news