మనం కొన్ని పనులు అవసరం లేకున్నా చేస్తూ ఉంటాం. అందులో ఒకటి ఏటీఎంలో మనీ డ్రా చేసేప్పుడు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. రిసిప్ట్ కావాలా అని .. అదేదో మనకి నిజంగా దాంతో పని ఉన్నట్లు యస్ అనే కడతాం..సరే వచ్చిన రిసిప్ట్ మనతోపాటు తీసుకొస్తామా అంటే లేదు.. తీసి అక్కడే పడేస్తాం.. మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటామో మనకే తెలియదు. కానీ ఈ తప్పు అస్సలు చేయకూడదట. రిసిప్ట్ అక్కడే పడేయటం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం.
కొన్ని కొన్ని సార్లు మనం డబ్బులు డ్రా చేసే ప్రాసెస్ అంతా అయిన తర్వాత డబ్బులు మన చేతికి రావు. కానీ మన అకౌంట్ లో మాత్రం బ్యాలెన్స్ కట్ అవుతుంది. అలాంటప్పుడు సమస్య పరిష్కరించుకోవడానికి బ్యాంకుకి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న ఈ రిసిప్ట్ తో మనం కంప్లైంట్ ఇవ్వచ్చు.
డబ్బులు డ్రా చేసిన తర్వాత వచ్చే రిసిప్ట్ మీద మన బ్యాంక్ డీటెయిల్స్ తో పాటు మన అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మనం ఎంత డ్రా చేశాము, ఇంకా మన ఎకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి అనే వివరాలు అన్నీ ఆ రిసిప్ట్ మీద ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు డ్రా చేసిన తర్వాత మనం రిసిప్ట్ అక్కడే పడేస్తే ఎవరైనా దొంగలు చూసి మన దగ్గర ఉన్న డబ్బు కోసం ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. నమ్మశక్యంగా లేకున్నా ఇలా జరిగే అవకాశం లేకపోలేదు.
ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం మంచికంటే ఎక్కువ చెడుకే ఉపయోగిస్తున్నారు. కాబట్టి హ్యాకర్స్ కి దొరికితే అందులో ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేసి బ్యాంక్ ఎకౌంట్ సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకుని డబ్బులు తీసేశా ప్రమాదం ఉంది. అందుకే రిసిప్ట్ పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి.
ఇదీసంగతి..మీరు జాగ్రత్తగా పెట్టుకోవటం మీకు పెద్ద సమస్య అనిపించినప్పుడు అస్సులు రిసిప్ట్ తీసుకోకండి. ఎలాగో మన బ్యాంక్ ఎకౌంట్ కి ఫోన్ నంబర్ లింక్ ఐ ఉంటుంది. సో మేసేజ్ మన ఫోన్ కు వస్తుంది కదా..!