MAA Elections: “ఇంతా అల‌జ‌డి అస‌లు మంచిది కాదు”.. ద‌ర్శ‌కేంద్రుడు సిరీయ‌స్‌

-

MAA Elections: గ‌తంలో ఎన్నాడు లేని విధంగా సార్వత్రిక ఎన్నికలా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఎట్ట‌కేల‌కు నెలరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. మా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ప్రారంభ‌మైన నాటి నుంచి.. ఫ‌లితాలు విడుద‌ల‌న రోజు వ‌ర‌కూ ఆరోపణలు, విమర్శలు ఒక్కటేమిటి ఎన్నో ఆస‌క్తిక‌ర ప‌రిమాణాలు చోటు చేసుకున్నాయి. ఫైనల్ గా మా అధ్యక్ష పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు ఘ‌న విజయం సాధించారు. మా అధ్య‌క్ష పీఠాన్ని కైవ‌సం చేసుకున్నారు.


ఇదిలాఉంటే.. ఇండ‌స్ట్రీలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. ప్రాంతీయ వాదం అనే అంశం వెలుగులోకి వచ్చింది. ప్రాంతీయ‌వాదం ఆధారంగా.. న‌న్ను తెలుగు వాడు కాదనీ, ఓడించారని, ఇక నుంచి మాలో ఉండలేనని ప్రకాష్ రాజ్ నిన్న మా ప్రాథ‌మిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇదే త‌రుణంలో.. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేదంటూ.. నాగ‌బాబు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దీంతో మరిన్ని రాజీనామాలు వచ్చే విధంగా కనిపిస్తుంది. ఇక మా ఎన్నికలు జరిగిన తీరు.. అభ్యర్థుల మధ్య జరిగిన వాగ్వాదాలపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.

తాజాగా మా ఎన్నిక‌ల‌పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సైతం స్పందించారు. మా ఎన్నికలు ఇంతలా అలజడి సృష్టించడం ఇండ‌స్ట్రీకి మంచిది కాదన్నారు. సినిమా పెద్దలు అందరూ కలిసి మా అధ్యక్షునిగా ఎవర్నో ఒకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఉంటే బాగుండేద‌ని సూచించారు. అదే మంచి పద్ధతి అని… మంచు విష్ణు మా అధ్యక్షుడిగా రాణిస్తాడనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు ద‌ర్శ‌కేంద్రుడు.

Read more RELATED
Recommended to you

Latest news