వాట్సాప్ లో మెసేజ్‌లు ఫార్వ‌ర్డ్ చేస్తుంటారా..? అయితే మీరు దీనిని తప్పక చూడాల్సిందే..!

-

ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తూ ఉంటారు. మెసేజ్ లని పంపుతారు. అలానే ఫొటోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఫార్వర్డ్ మెసేజ్లని కూడా పంపుతూ ఉంటారు. మీరు కూడా ఫార్వర్డ్ మెసేజ్లు పంపుతూ ఉంటారా..? అయితే ఈ ఫీచర్ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి.

ఫార్వర్డ్ మెసేజ్లని పంపించడం వల్ల ఫేక్ సమాచారం త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకనే ఫార్వర్డ్ మెసేజ్లు పైన వాట్సాప్ ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. కొత్త ఫీచర్ ని వాట్సాప్ దీని కోసం తీసుకు రాబోతోంది అని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ తో వాట్సాప్ యూజర్లు ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్ కు ఫార్వార్డ్ మెసేజ్లను పరిమితం చేయనుంది.

ఒకవేళ కనుక ఎవరైనా ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్ కి ఒకే సమయంలో ఫార్వర్డ్ చేయలేరు. దీంతో ఫేక్ వార్తలు రావడం తగ్గుతుంది. ఇప్పుడు వాట్సాప్ లో ఒకే గ్రూప్ చాట్ కి మాత్రమే సందేశాలను ఫార్వర్డ్ చేసే అవకాశాన్ని చెక్ చేస్తుంది. ఇప్పుడు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్ కి ఫార్వర్డ్ చేయడం కుదరదు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్స్ కి ఫార్వర్డ్ చేయాల్సి వస్తే యూజర్లు ఆ మెసేజ్ ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఫార్వర్డ్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news