జీవితంలో నమ్మకం కోల్పోతున్నారా..? ఐతే ఇది మీకోసమే..

-

మీరు అనుకున్నది సాధించాలన్నా, కావాల్సింది చేతికి అందాలన్న నమ్మకం అనేది కంపల్సరీ. నమ్మకం లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేరు. నీ చుట్టూ వెలుగు నిండుకున్నా నీలో వెలుగు లేదంటే అడుగు కూడా ముందుకు వేయలేవు. అందుకే నమ్మకం పోగొట్టుకోకూడదు. ప్రతీ ఒక్కరూ ఓడిపోతారు. ఓడిపోయినంత మాత్రాన మళ్ళీ గెలవలేరని కాదు కదా! గొప్ప గొప్ప వాళ్ళు కూడా మొదట్లో ఓడొపోయిన వారే కదా. ఇప్పుడున్న పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉండిపోదు. రేపేం జరుగుతుందో తెలియదు కాబట్టి రేపు కూడా ఓడిపోతానని ఎందుకు భయపడుతున్నావు.

జీవితం అనేది ఒక ప్రవాహం. దానికి గమ్యం లేదు. గమనం మాత్రమే ఉంది. ఆనందాల అడుగు వేసుకుంటూ హాయిగా సాగిపోవాల్సిందే. మధ్యలో ఎన్నో రాళ్ళు వస్తాయి. వాటి ధాటికి నువ్వు నిలబడకుండా అయిపోయినా మళ్ళీ తిరిగి లేవాల్సిందే. అలా లేవడానికి నీక్కావ్వాల్సింది నీపై నీకున్న నమ్మకమే. ఏదైనా చేయాలనుకుంటే చేయగలుగుతావు. లేదనుకుంటే లేదు.

ముందుగా నమ్మకం కోల్పోతున్నట్టు నీకనిపిస్తే, రొటీన్ కి భిన్నంగా వెళ్ళండి. కొత్త అలవాట్లు అలవర్చుకోండి. జీవితాన్ని కొత్త దృక్పథంతో చూడడం అలవాటు చేసుకోండి. మీ పక్కన మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే వ్యక్తులు ఉంటే దూరం జరగండి. మిమ్మల్ని మరింత అగాధంలోకి తోయడానికి వారు ప్రయత్నిస్తారు. డబ్బు లేకపోయినా, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా, మీ భాగస్వామితో ఇబ్బందులున్నా, ఎవ్వరూ మీ మీద నమ్మకం చూపకపోయినా మీ పై మీరు నమ్మకం పెట్టుకోండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే అలాంటి సమయంలో మీకు అండగా నిలవాల్సింది మీరే.

అందరూ మిమ్మల్ని వదిలిపెట్టినపుడు మీతో మీరుంటారు. మిమ్మల్ని మీరు వదిలిపెట్టాలనే ఆలోచన కన్నా మీతో మీరున్నారన్న ఆలోచన మంచిది. మీరు నమ్మకంగా కనిపిస్తే కొద్ది రోజులకి ఎదుటివాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అలా రాకపోయినా ఆల్రెడీ వాళ్ళని వదిలి ఉండటం మీకు అలవాటు అయ్యింది కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. ఇది మీ జీవితం. మీకేది కావాలో మీరే డిసైడ్ అవ్వండి. అది సాధించడానికి కృషి చేయండి. ఆ కృషి చేసే సమయంలో ఇబ్బందులని ఎదుర్కోండి.

Read more RELATED
Recommended to you

Latest news