కోడి గుడ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే జాగ్రత్త..!?

-

చాల మంది కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతుంటారు. కోడి గుడ్లు ఫ్రిజ్ లో పెట్టరాదు. అదేంటి కోడి గుడ్లు పెట్టేందుకు ఫ్రిజ్ లో స్పెషల్ రాక్ కూడా ఉంది. ఎక్కువ రోజులు చెడిపోకుండా గుడ్లు ఫ్రెష్ గా ఉంటాయని వాదించకండి. గుడ్లను ఇలా ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి తిన్నప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. గుడ్లని ఫ్రిజ్​లో స్టోర్​ చేయడం మనలో చాలామంది చేసే పని. కానీ, ఫ్రిజ్​లో ఎగ్స్​ స్టోర్​ చేయడం ‘యమా డేంజర్’​ అంటున్నారు నిపుణులు​.

అయితే గుడ్లలోని పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాల్షియం, ప్రొటీన్ వంటివి పుష్కలంగా ఉన్న గుడ్లను మనం సాధారణంగా ఫ్రిజ్‌లో పెడతాం. ఇలా ఫ్రిజ్‌లో దాచిన గుడ్లు తింటే ఆరోగ్యం సంగతేమోకానీ అనారోగ్యం తప్పదని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. చల్లటి వాతావరణంలో ఉన్న గుడ్లను రూమ్ టెంపరేచర్ వద్దకు తేగానే వాటిలో బ్యాక్టీరియా పెరిగే ఆస్కారం చాలా ఎక్కువ. ఫ్రిజ్​లో రోజుల తరబడి ఉంచిన గుడ్లని తినడం వల్ల ప్రొటీన్​, క్యాల్షియం అందడం మాట అటుంచితే లేనిపోని జబ్బులొస్తాయని హెచ్చరిస్తున్నారు వాళ్లు.

ఫ్రిజ్​లో ఉన్న గుడ్లని బయటికి తీసినప్పుడు వాటి టెంపరేచర్​ మారిపోయి పాడైపోతాయి. గుడ్ల పెంకులపై పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా ఏర్పడి అది గుడ్డు లోపలకి పోతుంది. అలాంటి గుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి. అందువల్ల గుడ్లని ఫ్రిజ్​లో స్టోర్​ చేయడం మంచిది కాదు అంటున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్. మరీ ముఖ్యంగా ఆరోగ్యం పేరుతో పిల్లలకు బ్యాక్టీరియా నిండిన గుడ్లు పెట్టొదంటున్నారు. మామూలు గది ఉష్ణోగ్రతలోనూ చాలా రోజుల పాటు గుడ్లు పాడవకుండా ఉంటాయి. కాబట్టి ఇకనుంచైనా ఫ్రిజ్​లో గుడ్లు స్టోర్​ చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news