యాత్ర 2 ప్రీమియర్స్‌కు మీరు సిద్దమా..?

-

దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో తమిళ నటుడు జీవ వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నటువంటి తాజా చిత్రం యాత్ర 2. ఇదివరకే 2019 ఎలక్షన్స్ కి ముందు యాత్ర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రము మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వల్ గా ఎన్నికల ముందు యాత్ర 2 ను తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి నిర్మిస్తున్నారు.

 

ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలవుతుంది. సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది .యాత్ర 2 నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా యూఎస్‌ఏ ప్రీమియర్స్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. యాత్ర2 ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ మొదలు అయ్యాయి. ప్రీమియర్స్‌కు మేము సిద్దం.. మీరు సిద్దమా..? అంటూ మేకర్స్‌ అప్‌డేట్ ఇచ్చారు.రాజశేఖర్ రెడ్డి మరణం ముందు, తర్వాత జగన్ పరిస్థితులు, ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అనే విషయాలను ఈ చిత్రం లో చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news