ఇంగ్లాండ్ తో జరిగే మిగతా టెస్టులకూ కోహ్లీ ఇక డౌటే…?

-

ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కి టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమైన సంగతి తెలిసిందే.టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ తో జరిగే 3, 4 టెస్టులకూ దూరమైనట్లు తెలుస్తోంది. ఐదో టెస్టు కూడా ఆడబోరని సమాచారం. వ్యక్తిగత కారణాలతో అతడు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. విరాట్ మరోసారి తండ్రి కాబోతుండటంతోనే ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు అందుబాటులో లేరని ఇటీవల ఏబీ డివిలియర్స్ చెప్పినా ఇందులో నిజం ఎంతన్నది స్పష్టతలేదు. మరోవైపు చివరి మూడు టెస్టులకు బీసీసీఐ రేపు జట్టును ప్రకటించే అవకాశముంది.

 

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులలో ఇరుజట్లు చెరొక విజయం సాధించడంతో సిరీస్ 1-1 తో సమం అయింది.ఇక మూడో టెస్ట్ భారత్ ,ఇంగ్లాండ్ మధ్య ఈనెల 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా మొదలుకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news