శ్రీశైలం మహా క్షేత్రంలో నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అంతే కాకుండా సమస్యలను అధిగమించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవో పెద్దిరాజు సూచనలు చేశారు.బుధవారం క్షేత్ర పరిధిలోని వివిధ ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రధానంగా మంచినీటి సరఫరా,ట్రాఫిక్, పార్కింగ్,విద్యుద్దీకరణ, క్యూలైన్ల నిర్వహణ, పాతాళగంగలో స్నానఘట్టాలు,తాత్కాలిక శౌచాలయాలు వంటి ఏర్పాట్ల పనులు వేగవంతం చేయాలన్నారు. విధుల్లో ఉండే సిబ్బందికి అల్పాహార వసతులను ఏర్పాటు చేయాలని,అదే విధంగా సమాచార సూచిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
వచ్చే నెల మార్చి 1 నుండి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రసిద్ధరావు, ఎస్ఐ లక్ష్మణరావు,యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, వైదిక సిబ్బంది తదితరులు ఉన్నారు.