చాలా మంది విపరీతంగా గురక పెడుతారు. దీని వలన వారితో పాటుగా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది నిద్రలో గురకపెట్టే సమస్య చాలా మందిలో వస్తూ ఉంటుంది. నిద్రలో గురక పెట్టడం కి కారణాలు చాలానే వున్నాయి. గురక వలన ఎదుటి వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది నిద్రపోయే టైంలో ముక్కుతో గాలి పీల్చడం లో సమస్యలు వచ్చినప్పుడు గురక వస్తుంది.
మానసిక ఒత్తిడి, పనులు ఇలా గురక చాలా కారణాల వలన వస్తుంది. మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. అధిక బరువు వలన కూడా గురక వస్తుంది. పని ఒత్తిడి వలన కూడా గురక వస్తుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి ఈ ఇంటి చిట్కాలను ట్రై చేయండి.
నిద్రపోయే ముందు అర టీ స్పూన్ తేనెలో ఆలివ్ ఆయిల్ వేసుకుని తాగితే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. గురక సమస్య నుండి బయటపడవచ్చు.
నిద్రపోయే ముందు అటుకులను తీసుకుంటే కూడా గురక కంట్రోల్ లో ఉంటుంది.
అలానే పిప్పర్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది గ్లాసు నీటిలో రెండు పిప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసుకుని నిద్రపోయే ముందు ఆ నీటిని పుక్కిలిస్తే గురక మాయమవుతుంది లేదంటే మీరు ఈ ఆయిల్ ని వాసన చూసినా సరే గురక దూరం అవుతుంది.
అర టీ స్పూన్ యాలకుల పొడిని వేడి నీళ్లలో కలుపుకుని తాగితే కూడా గురక సమస్య నుండి బయటపడవచ్చు నిద్ర కూడా బాగా పడుతుంది.
యూకలిఫ్టస్ ఆయిల్ కూడా చాలా చక్కగా పని చేస్తుంది గురక సమస్యతో బాధపడే వాళ్ళు వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే చక్కటి ఉపశమనాన్ని పొందొచ్చు. గురక నుండి బయటపడొచ్చు.