ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌.. ఎన్నో స్థానంలో అంటే..?

-

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ మహానగరం చోటుదక్కించుకుంది. ప్రపంచంలోనే భాగ్యనగరం 65వ స్థానంలో నిలిచింది. నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు ప్రముఖ నివేదిక తెలిపింది. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో ‘అత్యధిక నికర సంపదగల వ్యక్తుల’ సంఖ్య 78 శాతం పెరగడం విశేషం.

ఈ జాబితాలో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ తొలి స్థానంలో నిలిచింది. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023’ను మంగళవారం రోజున ఈ కంపెనీ విడుదల చేసింది. మొత్తం 97 పట్టణాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. జపాన్‌ రాజధాని టోక్యో 2,90,300 మంది మిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది. 2,85,000 మందితో శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా మూడో స్థానంలో ఉంది.

లండన్‌ (2,58,000), సింగపూర్‌ (2,40,100), లాస్‌ ఏంజెల్స్‌ (2,05,400), హాంకాంగ్‌ (1,29,500), బీజింగ్‌ (1,28,000), షాంఘై (1,27,200), సిడ్నీ (1,26,900) తొలి పది నగరాల జాబితాలో ఉన్నాయి. భారత్‌ నుంచి 59,400 మంది మిలియనీర్లతో ముంబయి 21వ స్థానం దక్కించుకొంది. తర్వాత దిల్లీ 30,200 మిలియనీర్లతో 36వ స్థానంలో, బెంగళూరు 12,600 మంది మిలియనీర్లతో 60వ స్థానంలో, కోల్‌కతా 12,100 మందితో 63వ స్థానంలో, హైదరాబాద్‌ 11,100 మందితో 65వ స్థానంలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news