మనకి తరచూ కలలోకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. నిద్ర పోయినప్పుడు కలలు రావడం అనేది సహజం. ఒక్కొక్క సారి పీడకలలు వస్తూ ఉంటాయి. ఒకసారి ఆనందంగా ఉండే కలలు వస్తూ ఉంటాయి. అలానే ఎప్పుడైనా మనకి పూర్వీకులు కూడా కలలోకి వస్తూ ఉంటారు. అయితే మరి ఎందుకు ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి..? ఈ కలలు వెనుక ఉండే కారణం ఏమిటి అనేది చూద్దాం.
సాధారణంగా హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వాళ్లకి కర్మ అలాగే వాళ్లని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ తద్దినం పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సంతోషంతో చనిపోయిన వాళ్ళు ఉంటారు అని అంటారు.
మీ పూర్వీకులు సహజ మరణానికి గురి అయితే కచ్చితంగా వాళ్ళు మీకు మంచే జరగాలని కోరుకుంటారు అలానే మీరు చేస్తున్న పనులన్నీ కూడా పూర్తవ్వాలని అనుకుంటారు. చక్కగా మీరు వృద్ధి చెందాలని పై నుండి ఆశీస్సులు ఇస్తారు. మీరు కనుక మీ తోబుట్టువులను తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చనిపోయిన పెద్దలు దీవెనలు మీకు ఉంటాయి.
అలాగే కలలో పాములు వస్తే కూడా పూర్వికులకి సంబంధించిన విషయమే. కలలో పాములు కనబడితే మీ పూర్వికులు మంచిని కోరుకుంటూ ఉంటారు. అలానే వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు ఇస్తున్నట్లు దీనికి అర్థం.
మీ కలలో కనుక పూర్వీకులు కనిపించారంటే వాళ్ళు ఉన్న లోకంలో ఆనందంగా ఉన్నట్లు అర్థం. ఇవన్నీ కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటే మీ మెదడు దృష్టి పెట్టడం వల్ల కలలోకి వాళ్ళు రావడం జరుగుతుంది ఇదే అసలు పూర్వీకులు కలలో కనబడడానికి గల కారణం.