కొంత మంది పిల్లలు చాలా ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. పైకి వాళ్ళు వాళ్ళ యొక్క బాధను చెప్పరు కూడా. ఒంటరిగా మీ పిల్లలు కనుక ఉంటున్నట్లయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు వారిని చూసుకోవాలి లేకపోతే పిల్లలు ఎటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు అనేది తెలియదు. పిల్లలు ఒంటరిగా ఉంటే అలా వదిలేయకూడదు కచ్చితంగా తల్లిదండ్రులు వారిని అర్థం చేసుకోవడానికి చూడాలి.
అలానే వాళ్లకి కలిగిన సమస్యను గుర్తించి సమస్యని పరిష్కరించాలి. మీ పిల్లలు కనుక ఒంటరిగా కానీ డల్ గా కానీ కనబడితే వారిని అలా వదిలేయొద్దు. చిన్నపిల్లలకి కూడా సమస్యలు ఉంటాయి అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే.
వారితో మాట్లాడండి:
పిల్లలని బెదిరించకుండా భయపెట్టకుండా స్నేహంగా వారితో మాట్లాడితే వాళ్లు సమస్యని చెబుతారు లేకపోతే ఆ విషయం మీకు తెలియదు సరి కదా వాళ్ళు ఆ సమస్యతో బాధపడుతూ ఉంటారు.
రహస్యం ఏమిటో చూడండి:
వారి ప్రవర్తనకు కారణం వాళ్ళు అలా ఉండడానికి కారణం మౌనం వెనుక ఉండే దానికి కారణం ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. వారి సమస్యలు మీకు చిన్నగానే కనపడొచ్చు కానీ వారికి మాత్రం అవి చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పే సమస్యలను మీరు సిల్లీగా తీసుకోవద్దు.
సరైన పరిష్కారాన్ని చూపండి:
పిల్లలకి సరైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత మీది. ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు అనేది తెలుసుకుని తగ్గట్టుగా మీరు సొల్యూషన్ ఇవ్వండి అప్పుడు కచ్చితంగా పిల్లలు సమస్య నుండి బయట పడతారు.