బిడ్డ పుట్టిన 9 నెలలకు దంతాలు రావడం మొదలవుతుంది. ఈ టైంలో.. పిల్లల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పసివయసు.. ఏదీ నోరు తెరిచి చెప్పలేని స్థితి.. వాళ్లు ఎలాంటి చిరాకు వచ్చినా.. ముందు ఏడ్చేస్తారు. ఇక ఈ దంతాలు వచ్చే సమయంలో.. వాంతులు, విరేచనాలు కూడా విపరీతంగా అవుతాయి. దీంతో బిడ్డ నీరసం అయిపోతాడు. ఇలాంటి టైంలో పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
పిల్లలకు పళ్లు వచ్చిన తర్వాత వాంతులు, విరేచనాల సమస్య ఉండటం సహజం. ముందుగా ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఉప్పు, పంచదార కలిపిన ద్రావణాన్ని పిల్లలకు ఇవ్వండి. దీనితో మీ బిడ్డకు బలహీనంగా అనిపించదు. కొంత ఉత్సాహంగా ఉంటారు. దంతాల వచ్చే సమయంలో పిల్లలకు చాలా తక్కువ ఆకలితో ఉంటారు. ఒకేసారి పాలు తాగలేరు. అలా అని మనం ఊరుకుంటే బిడ్డ ఇంకా నీరసం అయిపోతారు…ప్రతిసారీ పిల్లలకు పాలు తాగించేందుకు ప్రయత్నించండి. అలాగే కొంచెం.. కొంచెం నీరు కూడా ఇవ్వండి.
పళ్ళు వచ్చే సమయంలో మీరు మీ పిల్లలకు కొద్దిగా ఘనమైన ఆహారాన్ని ఇవ్వవచ్చు. ఈ సమయంలో వారికి అప్పుడప్పుడు సూప్-అరటిపండు, కిచ్డీ వంటివి ఇవ్వండి. దీనితో మీ బిడ్డ శారీరకంగా బలహీనంగా ఉండడు.
సూప్-అరటిపండు అంటే అరటిపండును మెత్తగా చేసి చిన్న చిన్నగా తినిపించాలి.. వారు తింటేనే ఇవ్వండి. కొందరికి ఆ వాసన పడక తినేందుకు అస్సలు ఇష్టపడరు. మరీ బలవంతంగా ఇది పెట్టొద్దు.
బియ్యం, పెసర పప్పును నీటిలో నానబెట్టి…ఓ అరగంట పాటు నానిన తర్వాత వాటిని ఉడికించండి. మెత్తగా ఉడికిన కచ్డీలో కొద్దిగా ఆవు నెయ్యిని జోడించి.. చిన్న చిన్నని గోరుముద్దలను తినిపించండి. పళ్ళు వచ్చేటపుడు పిల్లలకు తేనె ఇవ్వొచ్చు. దీంతో వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటు పంటి నొప్పికి కూడా ఉపశమనం లభిస్తుంది.
దంతాలు వచ్చిన మొదటి కొద్ది రోజులు పిల్లల శరీరం నుంచి చాలా నీరు(లాలాజలం, సొల్లు) బయటకు వస్తుంది. ఈ పరిస్థితిలో పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడానికి కొంత ఎక్కువగా నీరు ఇవ్వండి. దీని ద్వారా బిడ్డ డీహైడ్రేట్ అవకుండా ఉంటాడు.