దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.అయితే ఓ వైపు పీఎం సమీక్ష నిర్వహిస్తుంటే సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ప్లీనరీలో మునిగిపోయారని బిజెపి విమర్శలకు దిగింది.తాజాగా కెసిఆర్ ప్రధాని సమీక్షకుు హాజరు కాలేదు అంటూ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్.” మన దేశ్ కి నేత కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ సంబరాల్లో మునిగి తేలుకుంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహిస్తున్న covid రివ్యూ మీటింగ్ కు అత్యవసరంగా డుమ్మా కొట్టిండట” అంటూ ఎద్దేవా చేశారు.
ఈ సమావేశంలో పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రాలు కేంద్రం ఇంధన ధరలపై వ్యాట్ తగ్గించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం టాక్సులు తగ్గించడం లేదని ప్రధాని దుయ్యబట్టారు.ఇలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పీఎం కామెంట్ చేశారు.మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్,కేరళ, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు పన్నులు తగ్గించడం లేదని ప్రధాని చెప్పారు.
మన ‘దేశ్ కీ నేత’ కెసిఆర్, TRS పార్టీ సంబురాల్లో మునిగి తేలుకుంట అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహిస్తున్న #COVID రివ్యూ మీటింగ్ కు అత్యవసరంగా డుమ్మా కొట్టిండంట !!
— Arvind Dharmapuri (@Arvindharmapuri) April 27, 2022