ఇలాంటి సినిమానా నిర్మించావని విమర్శిస్తారనే అర్జున్ రెడ్డి ఒప్పుకోలేదు.. నిర్మాత స్వప్న దత్

-

ప్రముఖ నిర్మాత స్వప్న దత్త తాజాగా తను అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించలేకపోయినందుకు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కదా తనను ఎంతో ఆకట్టుకుందని కానీ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీయలేకపోయానని తెలిపారు.

వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు అశ్విని దత్ కుమార్తెగా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన స్వప్న దత్ 2000లో ఆజాద్ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా 18 ఏళ్ల వయస్సులో చలనచిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ సినిమా అనంతరం తన తండ్రి అశ్వినీ దత్, సోదరి ప్రియాంక దట్ లతో కలిసి వైజయంతి మూవీస్ బ్యానర్ లో పలు చిత్రాలను నిర్మించారు. అయితే ఈమె తాజాగా తను నిర్మించిన సినిమాలపై ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Swapna Dutt Emerges as Winner Finally

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వప్న దత్ అర్జున్ రెడ్డి సినిమా కథ తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు. అయితే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తీయలేకపోయానని అన్నారు. ఈ సినిమా చేయాలని ముందు ఆశపడ్డాను అయితే ఒకవేళ సినిమా అటు ఇటు ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసిందా అని విమర్శిస్తారని భయపడ్డాను. అంటూ తెలిపారు ఇప్పటికే ఆ సినిమాను నిర్మించలేకపోయినందుకు బాధపడుతూ ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే ‘పెళ్లి చూపులు’ సినిమా ఫార్మాట్ భిన్నంగా ఉండడంతో తనకు అర్థం కాలేదని, అందుకే ఆ సినిమాపై తాను ఆసక్తి చూపించలేదన్నారు.

కాగా కెరియర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసానని.. ఓ ఛానల్ ప్రారంభించి విఫలం అవ్వడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ ఛానల్ లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కొన్నాళ్లు ఇబ్బందులు ఎదురైనా నడిపినప్పటికీ ఆ తర్వాత తన వల్ల కాకపోవడంతో మూసేసానంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తన జీవితంలో ఆనందంగానే ఉన్నానని మళ్లీ కమ్ బ్యాక్ అవటానికి ప్రేక్షకులే ఎంతగానో సహాయం చేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news