అర్జున్ రెడ్డి డైరెక్టర్ జాబితాలో పాన్ ఇండియా హీరో..!

అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆ తర్వాత అదే సినిమాని హిందిలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. దాంతో బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగాకి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ హీరో దొరకని కారణంగా సందీప్ వంగా నెక్స్ట్ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం అర్జున్ రెడ్డి డైరెక్టర్, పాన్ ఇండియా హీరో యష్ కోసం కథ రాస్తున్నాడట.

కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన యష్, ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దాంతో యష్ తో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న యష్, ఆ తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడనేది ఇంకా వెల్లడి కాలేదు. కాకపోతే అర్జున్ రెడ్డి డైరెక్టర్, యష్ కోసం కథ రాస్తున్నాడట. మరి వీరిద్దరి కాంబినేషన్ కుదిరి మరో సంచలనానికి తెరలేస్తుందేమో చూడాలి.