కరోనా వైరస్ దేశంలో పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది… తాజాగా ఒక యాప్ ని ప్రవేశ పెట్టారు. ఈ మొబైల్ యాప్‌ని కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ రూపొందించింది. వారం క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ని దాదాపు కోటి మంది వరకు డౌన్ లోడ్ చేసుకున్నారు. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
గూగుల్ ప్లే, యాప్ స్టోర్ లో ఇది అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్ తోపాటూ… మొత్తం 10 భారతీయ భాషల్లో ఈ యాప్ లభిస్తోంది. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత… బ్లూటూత్ ఆన్ చెయ్యాలి. లొకేషన్ కూడా ఆన్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది. ప్రతి రోజూ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు… అంటే దగ్గు ఉందా, జలుబు ఉందా, గొంతు నొప్పిగా ఉందా అనే ప్రశ్నలు అడుగుతుంది.
మీకు గనుక ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై… రాష్ట్ర ప్రభుత్వం మీ కోసం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ ప్రక్రియ ప్రారంభిస్తుంది.
ఈ యాప్ ని ఏ విధంగా వాడాలి అంటే…
1. బ్లూటూత్, లొకేషన్ ఆన్ చెయ్యాలి. యాప్ ఇన్‌స్టాల్ చెయ్యాలి.
2. ఆ తర్వాత మీకు ఓ OTP రాగానే… దాన్ని యాప్‌లో ఎంటర్ చెయ్యాలి.
3.కింద ఉండే ఆప్షన్‌లో మీ జెండర్ (male or female) చెప్పాలి.
4.మీ పూర్తి పేరు, వయసు, వృత్తి వివరాలు అడుగుతుంది. ఇవ్వాలి.
5.మీరు గత 30 రోజుల్లో విదేశాలకు వెళ్లారా అని అడుగుతుంది. సమాధానం ఇవ్వాలి. (మీరు వెళ్లి ఉంటే… మీతోపాటూ… ఎవరెవరు ప్రయాణించారో గ్రహించి, ICMR డేటాను ఉపయోగించుకుని వారికి కరోనా ఉంటే, మీకు వచ్చే అవకాశాల్ని వివరిస్తుంది. ఇందుకు టుంది)
6.మీరు అవసరమైతే వాలంటీర్‌గా కరోనా సేవల్లో పాల్గొంటారా అని అడుగుతుంది. మీరు Yes అని చెబితే… 20 సెకండ్ల అసెస్‌మెంట్ టెస్ట్ మొదలవుతుంది.
ఈ యాప్ ని వాడుకునే వారి వివరాలు కూడా మీ దగ్గర ఉండేలా చేస్తుంది యాప్.