అమెరికా సంబంధమా…? వద్దు బాబోయ్…!

-

అమ్మాయిని అమెరికాకి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రకృతి విపత్తులను, ప్రమాదాలను ఎవరు మాత్రం ఊహిస్తారు గాని ఇప్పుడు కొన్ని కొన్ని వాస్తవాలను మనం మాట్లాడుకోవాలి. అమెరికా సంబంధం అనగానే మన దేశంలో ఎక్కడ లేని ఆరాటం ఉంటుంది. అమెరికాలో ఉంటే తమ కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అని భావిస్తారు.

కొంత మంది అయితే మరీ ఎక్కువగా ఊహించుకుని అమ్మాయి అమెరికా వెళ్ళినా అబ్బాయి అమెరికా వెళ్ళినా తమ బ్రతుకులు మారిపోవడం ఖాయమని బలంగా నమ్ముతూ ఉంటారు. అలాంటి వారిని ఇప్పుడు కరోనా నరకం చూపిస్తుంది. అమెరికా విద్య కోసం చదువు కోసం… పెళ్లి చేసుకుని భర్త కోసం వెళ్ళిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అక్కడ కరోనా చాలా దారుణంగా ఉంది అనే విషయం తెలుసు.

చైనా లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో కూడా పిల్లలను అమెరికా పంపించారు కొందరు. సంక్రాంతి పండగకు వచ్చిన వాళ్ళను కూడా పంపించారు. ఇక్కడ ఎక్కువ మాట్లాడటం అనవసరం గాని ఇప్పుడు సోషల్ మీడియాలో అంటుంది ఏంటీ అంటే… ఇండియాలో మన కళ్ళ ముందు ఉండే అల్లుడు పనికి రాని వాడు అయ్యాడు… అమెరికాలో ఇప్పుడు పిల్లలను పెట్టుకుని మీరు ఎం సుఖ పడుతున్నారు…?

అందుకే ఆశకు పోతే ఇలాగే ఉంటుంది… విదేశాల్లో ఉండటం అంత మంచిది కాదు అనే విషయాన్ని ఇప్పటికి అయినా గ్రహించండి… ఇక్కడ ఉంటే వంద రూపాయలతో రోజు గడుస్తుంది. అమెరికాలో ఉంటే రోజు గడవడం పక్కన పెట్టు ఉద్యోగ౦ పోతే ఆ బాధ ఎవరికి చెప్పుకోలేనిది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అమెరికా అల్లుడు డబ్బు ఉన్న వాడే కావొచ్చు గాని… ఆ డబ్బు అన్నింటికీ పరిష్కారం కాదని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అమెరికా ప్రాణాలతో పోరాడుతుంది. కనీసం అక్కడ మన వాళ్ళను పట్టించుకునే వాడు లేడు.

Read more RELATED
Recommended to you

Latest news