ప్రొఫెసర్ హరగోపాల్ ని అరెస్ట్ చేయడం అమానుషం : హరీశ్ రావు

-

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గ్రామస్తులు కలిసికట్టుగా చేస్తున్న ఈ నిరసనకు మద్దతు తెలిపేందుకు పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అక్కడికీ బయలుదేరారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను మార్గమద్యమంలో అడ్డుకొని అరెస్ట్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పౌర హక్కుల నేత అయిన ప్రొఫెసర్ హరగోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.

రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటూ గప్పాలు కొట్టి.. ఇప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతు నొక్కడం అమానుషం అని మండిపడ్డారు. హరీశ్ రావు తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు. “సీఎం రేవంత్ రెడ్డి గారు.. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేసుకున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు”అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news