రాజమండ్రి: టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ సంస్థపై జూ. ఆర్టిస్ట్ బోయా సునీత సంచలన ఆరోపణలు చేసింది. నిర్మాత బన్నీ వాసు తనను కారులో తీసుకు వెళ్లి సెక్సువస్ గా హెరాష్ చేసాడని జూనియర్ ఆర్టిస్ట్ సునీత నిప్పులు చెరిగారు. జనసేన పార్టీలో ఉన్న బన్నీ వాసు పై పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయాలని తాను అనుకున్నప్పుడల్లా…ఆయన దృష్టికి తీసుకుని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆమె పేర్కొంది.
జనసేన పార్టీ పరంగా అనేక ప్రోగ్రామ్స్ కు అటెండ్ అయ్యాను… ఆ టైం లో బన్నీ వాసు సినిమాలో అవకాశం ఇస్తానని ఇవ్వలేదని ఆరోపణలు చేసింది. జీవిత రాజశేఖర్ వద్ద పంచాయితీ పెట్టి రాజీ కుదార్చాలని చూసారని సునీత ఫైర్ అయ్యారు. త్వరలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో వైసిపి లో జాయిన్ అవుతానని జూ. ఆర్టిస్ట్ సునీత ప్రకటన చేశారు. వైసిపి పార్టీలో చేరి జనసేన పవన్ ఫాన్స్ నాలుక కోస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జూ. ఆర్టిస్ట్ సునీత హెచ్చరించారు.