తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి రమ్యకృష్ణ, హీరోయిన్ గా అయినా మరో కీలక పాత్రలో అయినా సరే ఆమెను ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర తర్వాత ఆమెకు డిమాండ్ పెరిగింది. తమిళ సినిమాల్లో ఆమెకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇక మన తెలుగులో కూడా అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు ప్రాధాన్యత లభిస్తుంది అనేది వాస్తవం.
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు గాను ఆమెను ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆమెను తీసుకోవాలని భావించారు. రాజకీయ నాయకురాలిగా… అది కూడా ముఖ్యమంత్రి పాత్రకు ఆమెను ఎంపిక చేసారు. అయితే ఏమైందో ఏమో గాని ఆమె తప్పుకుంది అంటున్నారు. ఆమె భారీగా డిమాండ్ చేసినట్టు సమాచారం. రెండు కోట్ల వరకు అడిగినట్టు తెలుస్తుంది.
ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండటం తో ఆమె ఎక్కువగా డిమాండ్ చేసింది అంటున్నారు. దర్శక నిర్మాతలు భయపడి ఆమెను వద్దని చెప్పినట్టు సమాచారం. ఆమె తగ్గలేదని అందుకే వద్దన్నారట. కాగా ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.