వీడియో : తండ్రిని భుజం మీద మోసుకుని వెళ్ళిన కొడుకు…!

-

అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఒక మధ్య వయస్కుడు భుజాల మీద మోసుకు వెళ్ళిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఈ ఘటన కేరళ లోని పునలూర్ లో చోటు చేసుకుంది. అతను నడుపుతున్న ఆటోని లాక్ డౌన్ లో భాగంగా పోలీసులు ఆపేశారు. దీనితో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రిని తీసుకు వస్తున్నాడు. పోలీసులు ఆపేయడం తో దాదాపు కిలోమీటర్ పాటు తన తండ్రిని మోసుకుని వెళ్ళాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, ఆ వ్యక్తి తండ్రిని భుజాలపై మోసుకెళ్ళడం కనపడుతుంది. ఇక ఆసుపత్రి పత్రాలు, ప్రిస్క్రిప్షన్లు మరియు ఇతర వస్తువులను తీసుకువెళుతున్న ఒక మహిళ అతనితో పాటు నడుస్తుంది. ఈ సంఘటన కొల్లం జిల్లాలోని పునలూర్ పట్టణంలో జరిగింది. కులతుపుళాకు చెందిన 65 ఏళ్ల వ్యక్తిని పునలూర్ తాలూకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు.

పోలీసులు ఆటో ని తీసుకుని వెళ్ళడానికి నిరాకరించడం తో ట్రాఫిక్ జామ్ మధ్యలో వారి ఇంటి నుండి ఒక కిలోమీటరు దూరంలో ఆపేశారు. దీనితో తప్పని పరిస్థితుల్లో తన తండ్రిని భుజానికి ఎత్తుకుని తీసుకుని వెళ్ళాడు. పోలీసులకు చెప్పి, ఆసుపత్రి నుండి పేపర్లు చూపించిన తరువాత కూడా అతన్ని వెళ్ళడానికి అనుమతించలేదు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మానవ హక్కుల సంఘం స్పందించి వివరాలు సేకరించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు లో ఉన్న నేపధ్యంలో వైద్య అత్యవసర పరిస్థితులు మినహా ఏవీ కూడా అనుమతించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news