పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి. వివాదాస్పద సరిహద్దులన్నింటికీ అఖిలపక్షంగా ఎంపీలను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఇది భారత సార్వభౌమత్వాన్ని మరింత పెంచుతుందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ఇటీవల ఇండియా, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గతంలో గాల్వన్ లోయలో ఇరు దేశాల మధ్య ఘర్షణను మరిచిపోకముందే ఇటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ప్రాంతాల సరిహద్దుల్లో కవ్వింపు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించింది. మరోవైపు సిక్కిం సరిహద్దుల్లో చుంబీలోయలో సరిహద్దు అతిక్రమణకు పాల్పడుతోంది. దీంతో అక్కడ నుంచి భారత్ పై నిఘా పెడుతుంది. దీంతో ఆప్రాంతానికి సమీపంలో ఉండే సిలిగురి కారిడార్ చికెన్ నెక్ పై చైనా ద్రుష్టి పెడుతుందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ శీతాకాలం సమావేశాల్లో సరిహద్దు భద్రత పై చర్చించాలని అన్నారని తెలుస్తోంది.