తెలంగాణ: లాక్డౌన్ పై అసదుద్దీన్ వ్యాఖ్యలు.. 10రోజుల తర్వాత..

ఎట్టకేలకు తెలంగాణలో లాక్డౌన్ ప్రకటన వచ్చేసింది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్ విధించిన చివరి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు లాక్డౌన్ విధించకపోవడానికి కారణం రంజాన్ పండగే  అన్న ఆరోపణలు వచ్చాయి. ఐతే పండగ కంటే ముందే లాక్డౌన్ విధించారు. తాజాగా లాక్డౌన్ పై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ముందుగా 10రోజులు విధించారు. ఆ తర్వాతే ఈ నెల చివరి వరకు లాక్డౌన్ ఉంటుందన్న వార్తలు రావడం మొదలయ్యింది.

ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ, లాక్డౌన్ పదిరోజుల తర్వాత పొడిగించకుండా ఉండాలని అన్నాడు. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతినడమే కాదు, ఎంతో మంది జీవితం దెబ్బతింటుందని, అందువల్ల పది రోజుల తర్వాత లాక్డౌన్ ని పొడిగించకుండా ఉంటే బాగుంటుందని అన్నాడు. రోజు రోజుకీ పెరుగుతున్న కేసుల కారణంగా తెలంగాణలో లాక్డౌన్ విధించాలని చాలా మంది భావించారు.