అసని తుఫాను ముందుగా చెప్పినట్టుగానే చీరాల – బాపట్ల వైపుగా అడుగులు వేస్తోంది. మరో వైపున ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న విస్తారమైన వర్షాలు రాయలసీమ జిల్లాల్లోకి ముఖ్యంగా కడప, నంధ్యాల వరకు విస్తరించి ఉంది. ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో వైపున అసని తుఫాను వల్ల గాలుల వేగం గంట గంటకు మరింత పెరగనుంది. మచిలీపట్నం నుంచి సింగరాయకొండ వరకు గాలుల తీవ్రత ఈ రోజు అర్ధరాత్రి 100 కి.మీ. కంటే ఎక్కువ ఉంటుంది. కనుక సంబంధిత ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయమై ఇప్పుడే బాపట్ల, ప్రకాశం కలెక్టర్లకు చెప్పడం జరిగింది.