సింగరేణి కార్మిక చైతన్య యాత్ర ముగింపు సభలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించిన సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నన్ను టీఆరెస్ పార్టీ నుండి మెడలు పట్టి బయటికి పంపించింది.. అయినా నాకు మరోసారి తెలంగాణ కొరకు పోరాటం చేసే అవకాశం లభించినందుకు అదృష్టంగా భావిస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈటెలను శ్రీరాంపూర్ కు ఎందుకు పిలుస్తున్నారన్నారు. కానీ.. ఈటల దిష్టి బొమ్మను దగ్ధం చేయమని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిందన్నారు.
నన్ను తగలపేట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ చివారికీ మిరే తగలబడతారని ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు 1.20 లక్షల మంది కార్మికులు సింగరేణి సంస్ధలో పనిచేస్తే.. ఇప్పుడు 43 వేల కార్మికులు మాత్రమే వున్నారన్నారు. కేసీఆర్ వల్లే కార్మికుల సంఖ్య తగ్గిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని, కేసీఆర్ ని బొందపెడితే తప్ప తెలంగాణ బాగుపడదంటూ అగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.