తమిళ కథానాయిక ఆషిమా నర్వాల్, తెలుగు వారికీ పరిచయమే. ఆమె నటించిన జెస్సీ, నాటకం చిత్రాలు తెలుగు నాట కూడా రిలీజ్ అయ్యాయి. ఐతే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఆషిమా నర్వాల్ ఒకానొక తెలుగు సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది.
https://www.instagram.com/p/CGUtCS9Hu7H/?utm_source=ig_web_copy_link
సిగరెట్ తాగుతూ బాలయ్య డైలాగ్ చెప్పిన ఆషిమా, ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే డైలాగుని చెబుతూ, చేతిలో సిగరెట్ పట్టుకుని ఒక దమ్ము లాగింది. ఐతే సినిమా కోసం సిగరెట్ తాగాడం ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపింది. అంతే కాదు సిగరెట్ తాగడం మంచిది కాదని, పొగత్రాగి అనారోగ్యానికి గురి కావద్దని చెబుతుంది.