హీరో విశ్వక్ సేన్, టీవీ 9 యాంకర్ వివాదంపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

-

హీరో విశ్వక్ సేన్ ఫ్రాంక్ వీడియో ప్రస్తుతం లేటెస్ట్ గా వివాదానికి కారణమైంది. తన కొత్త సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా చేేసిన ఓ ప్రాంక్ వీడియో ప్రస్తుతం రచ్చకు కారణం అయింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రాంక్ వీడియో పై ఇవాళ టీవీ9లో డిబేట్ జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా స్టూడియోకు వచ్చిన హీరో… యాంకర్ దేవి నాగవల్లి తో డిబేట్ లో పాల్గొన్నాడు. డిబేట్ కొనసాగుతుండగా విశ్వక్ సేన్ డిప్ ప్రెస్ డ్ పర్సన్ అని దేవి అన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన విశ్వక్ సేన్ అంతే స్థాయిలో బదులిచ్చాడు. దీంతో యాంకర్ దేవీ నాగవల్లి విశ్వక్ సేన్ ను గెటవుట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇప్పుడు ఈ వివాదంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పురుషుడి కన్నా పవర్ ఫుల్ గా మహిళ కనిపించడం నేను ఇంత వరకు చూడలేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే వర్మ ఈ ట్వీట్ ను పొగుడుతూ చేశాడో… వెతకారంతో చేశాడో తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news