పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే పెళ్లి చూపులకు వెళ్తున్న అబ్బాయిలు ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోవాలని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు.
నిజానికి చాణక్య జీవితానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలను చెప్పారు. వాటి ప్రకారం అనుసరిస్తే మీ జీవితానికి ఎటువంటి ఢోకా ఉండదు. అయితే చాణక్య నీతి పెళ్లి చూపులకు వెళితే అబ్బాయిలకి చెప్పిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్య నీతి ప్రకారం స్త్రీ యొక్క అందాన్ని చూసి పెళ్లి నిర్ణయించుకోవడం అనేది తప్పు. వివాహానికి కావాల్సింది బాహ్య సౌందర్యం కాదు. విద్యని, సంస్కృతిని పరిగణలోకి తీసుకుని అప్పుడు పెళ్ళికి సిద్ధం అవ్వాలి. కానీ బయట కనిపించే అందానికి ప్రాముఖ్యతను ఇచ్చి పెళ్లి కి ఒప్పుకోవడం సరైనది కాదని ఆచార్య చాణక్య చెప్పారు.
అలాగే పురుషుడితో పాటు స్త్రీకి కూడా మతపరమైన ఆచారాలపై నమ్మకం ఉండాలి అని చాణక్య నీతి ద్వారా చాణక్య చెప్పారు. కనుక ఆ అమ్మాయికి మతపరమైన నమ్మకాలు కలిగి ఉన్నాయో లేదో చూడాలి.
అదే విధంగా మధురంగా మాట్లాడే స్త్రీ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే స్త్రీ మధురం గా మాట్లాడితే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది.
నచ్చకుండా ఎప్పుడూ వివాహం చేసుకోకూడదు. నచ్చకుండా పెళ్లి చేసుకోవడం వల్ల జీవితభాగస్వామి భవిష్యత్తులో సంతోషాన్ని అందించలేదు కాబట్టి పెళ్లి చూపులకు వెళ్లే అబ్బాయిలు వీటిని దృష్టిలో పెట్టుకుని పెళ్ళికి ఒప్పుకోవడం మంచిది.