నెటిజన్ అత్యుత్సాహం.. చెప్పు చూపించిన అషూ రెడ్డి..!

-

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో.. వీడియోలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హాలీవుడ్ హీరోయిన్ రేంజిలో గ్లామర్ వలకబోస్తూ తన అందచందాలతో టైట్ ఫిట్ అందాలతో కుర్ర కారు గుండెలను విచ్ఛిన్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంత గా పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది. మొన్నమధ్య ఆర్జీవి బోల్డ్ ఇంటర్వ్యూ లతో తెగ వార్తల్లో నిలిచిన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తీరిక దొరికినప్పుడల్లా సామాజిక మాధ్యమాల వేదికగా నేటిజనులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చే ఈమె ఇటీవల నెటిజన్స్ తో మరొకసారి ముచ్చటించింది. ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ చాట్ చేసింది. అందులో భాగంగానే తన ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి నెట్జన్లో అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా ఆన్సర్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇదే క్రమంలో ఒక నెటిజన్ అత్యుత్సాహం చూపించాడు. ఈ మధ్య నీకు ఓవరాక్షన్ బాగా ఎక్కువైనట్లు అనిపించడం లేదా అని అడిగాడు. దీనికి స్పందించిన అషూ రెడ్డి అవును కానీ ఈమధ్య కాస్త తగ్గింది అనే కౌంటర్ ఇస్తూనే చెప్పు ఉన్న ఎమోజిని షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే టీవీ షో లతో పాటు అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తోంది.. కొన్ని రోజుల క్రితమే ఫోకస్ అనే సినిమాలో నటించిన ఈమె మరికొన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news