ఆసియా కప్ 2023: ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4 కు వెళ్లాలంటే ?

-

ఆసియా కప్ లో మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం తలపడగా, అందులో రెండు జట్లు ఎలిమినేట్ అవనుండగా మిగిలిన నాలుగు జట్లు సూపర్ 4 కు అర్హత సాధిస్తాయి. ఆ విధంగా చూస్తే గ్రూప్ ఏ నుండి ఇండియా మరియు పాకిస్తాన్ లు సూపర్ 4 కు వెళ్లగా, నేపాల్ ఇంటి దారి పట్టింది. ఇక గ్రూప్ బి లో ఎవరు ఇంటి దారి పట్టనున్నారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ రోజు శ్రీలంక మరియు ఆఫ్గనిస్తాన్ లు లాహోర్ వేదికగా మ్యాచ్ ఆడుతున్నారు. మొదట టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత ఓవర్ లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ సూపర్ 4 కు క్వాలిఫై అవ్వాలి అంటే శ్రీలంక నిర్దేశించిన టార్గెట్ ను 36 ఓవర్లలో చేధించాలి అప్పుడు మెరుగైన రన్ రేట్ తో ఆఫ్గనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లు సూపర్ 8 కు వెలుతాయి.

ఒకవేళ ఓడిపోయినా లేదా 36 ఓవర్ లకు మించి చేధించిన శ్రీలంక బంగ్లాదేశ్ లు అర్హత సాధిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news