రేపటి నుండి శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా ఆసియా కప్ మొదలు కానుంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇండియా తన మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ఆడనుంది. కాగా తాజాగా బీసీసీఐ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల గాయం నుండి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన కె ఎల్ రాహుల్ ఆసియా కప్ లో రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడు. గాయం నుండి పూర్తిగినా కోలుకున్నప్పటికీ , 100 శాతం ఫిట్నెస్ సాధించలేని కారణం వలన శ్రీలంకకు వారం రోజుల తర్వాతనే బయలుదేరనున్నాడట. అందుకే ఆసియా కప్ లో మొదటి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడు.
ఇక వరల్డ్ కప్ కు టీం ను మూడవ తేదీన ప్రకటించనున్న నేపథ్యంలో రాహుల్ కు జట్టులో చోటిస్తారా లేదా అన్నది సందేహమే ?