ఆసియా కప్ ఆతిథ్యం నుంచి శ్రీలంక అవుట్….?

-

మిని వరల్డ్ కప్ గా భావించే ఆసియా కప్ క్రికెట్ టోర్నిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దఫా ఆసియా కప్ క్రికెటక్ టోర్నికి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. ఆదేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు, ఆందోళనలు చేస్తున్నారు. రానున్న మరికొన్ని నెలల్లో శ్రీలంక పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే జనాలు నిత్యావసరాల కోసం షాపుల ముందు గంటల కొద్ది, కిలోమీటర్ల మేర క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డిజిల్ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఏకంగా ఆర్మీనే పెట్రోల్ స్టేషన్ల వద్ద గస్తీ ఉంటున్నారంటే శ్రీలంక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజల వద్ద సరుకులు కొందాం అంటే డబ్బులు లేవు. డబ్బులు ఉన్నా మార్కెట్ లో సరుకులు ఉండటం లేదు. శ్రీలంక ప్రజలు నగదు కోసం బంగారాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చింది. 

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగాల్సిన ఆసియా కప్ మెగా టోర్నిని ప్రస్తుతం శ్రీలంక నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ఆసియా కప్ క్రికెట్ టోర్నీ శ్రీలంక నుంచి తరలిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆదేశంలో క్రికెట్ టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నాయి. అయితే టోర్నీని ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news