గతంలో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో ఇండియా తరపున జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా పోటీ చేసి గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇతని పేరు ఇండియా అంతటా మారు మ్రోగిపోతోంది. ఇక తాజాగా చైనా లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో నీరజ్ చోప్రా పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ రోజు ముగిసిన ఫైనల్స్ లో ఇండియాకు చెందిన తన ప్రత్యర్థి కిషోర్ కుమార్ జైన్ తో పోటీ పడి విజయాన్ని సాధించాడు నీరజ్ చోప్రా. వీరిద్దరూ ఫైనల్ కు చేరుకోగా ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది.. ఇద్దరూ కూడా ఒకరిని మించి మరొకరు జావెలిన్ త్రొను విసరగా చివరికి ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రానే గోల్డ్ మెడల్ వరించడం విశేషం. ఆ విధంగా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ ను అందుకోగా, తన ప్రత్యర్థి కిషోర్ కుమార్ కు సిల్వర్ మెడల్ దక్కింది.
ఇక ఫైనల్ లో నీరజ్ చోప్రాకు చమటలు పట్టించిన కిషోర్ కుమార్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.