సాధారణంగా ఈ రోజుల్లో మనకు ఏ సమాచారం కావాలన్న గూగూల్ సెర్చ్ చేయడం మామూలే. కానీ, గూగూల్ దొరికేవి అన్ని నిజాలు కావు. వాటిలో కొన్ని నకిలీ సెర్చ్ ఫలితాలు కూడా వస్తాయి. ఎస్‌ఈఓలు మోసుకొచ్చే మార్కెటింగ్ లింక్‌లు ఉంటాయి.
సెర్చ్ చేయకూడనివి
కస్టమర్ కేర్ నంబర్లు, డీటీహెచ్, క్రెడిట్ కార్డు వంటివి గూగూల్‌లో సెర్చ్ చేయకపోవడమే మేలు. ఎందుకంటే అవి స్కామర్ల నకిలీ నంబర్లు అవ్వచ్చు. వీటికోసం సంబంధిత అధికారిక యాప్‌ల వెబ్‌సైట్‌లో చూడండి.
యూఆర్‌ఎల్ లింకులు కూడా గూగూల్ సెర్చ్ అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ అలవాటును మనం మానుకోవాలి. ఎందుకంటే అక్షరం తేడాతో ఫేక్ యూఆర్‌ఎల్ లింక్లను స్కామర్లు క్రియేట్ చేస్తారు. దీనివల్ల మీ వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయి.
యాప్‌లను ఎంచుకోవద్దు
మన ఫోన్లలో ఎన్నో యాప్‌ల అప్లికేషన్లు ఉంటాయి. గూగూల్ సెర్చ్ ద్వారా వెతికే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే అనధికారిక సైట్‌ల నుంచి డౌన్లోడ్ చేసే మాల్వేర్ సాఫ్టవేర్లు అయి ఉండవచ్చు. అందుకే అధికారిక సైట్‌ల నుంచే డౌన్లోడ్ చేసుకోండి.
మెడిసిన్ సెర్చ్
ఒంట్లో ఏ మాత్రం నలతగా ఉన్నా మందుల్ని కూడా గూగూల్ సెర్చ్ చేస్తారు. అది మంచిది కాదు. అలాగే మందుల్ని ఆన్‌లైన్లో ఆర్డర్ కూడా చేస్తారు. అలా కాకుండా డాక్టరును సంప్రదించి సరైన చికి త్స చేయించుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గడం వంటి చిట్కాలను అస్సటు పాటించవద్దు.
ఆర్థిక లావాదేవీలు
ప్రభుత్వం రంగ యూఆర్‌ఎల్ లింక్‌లను కూడా ఓపెన్ చేయడం మానేయాలి. ఉదాహరణకు మున్సిపల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్లు వివిధ లింక్లను యాక్సెస్ చేయడం సేఫ్ కాదు.
కూపన్ల వేట
ఆన్‌లైన్ షాపింగ్ డిస్కౌంట్ కూపన్లు అధికారిక వెబ్‌సైట్లో అయితే సమస్య లేదు. కానీ, నెట్టింట్లో నకిలీ కూపన్లే ప్రమాదం. ఎందుకంటే ఆకట్టుకునే వోచర్లు క్రియేట్ చేసి హ్యాకర్లు మన బ్యాంకింగ్ డిటెయిల్స్ తస్కరించడానికి సిద్ధంగా ఉంటారు.