ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మహిళల మధ్యన ఒకే ఒక యాషెస్ టెస్ట్ ఈ రోజు మధ్యాహ్నం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ లో ఇరు జట్లు మూడు రోజుల వరకు పోటాపోటీగా ఆడుతూ వచ్చాయి. కానీ నాలుగవ రోజులో బౌలర్లు పూర్తిగా తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా… అందుకు బదులుగా ఇంగ్లాండ్ బాగానే ఆడుతున్నట్లు కనిపించింది.. అయితే ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ గార్డెనర్ ఎంట్రీ ఇచ్చి వాతావరణాన్ని మార్చి వేసింది. వరుసగా వికెట్లను తీసి ఆస్ట్రేలియాను గేమ్ లోకి తీసుకువచ్చింది. కానీ ఆ తర్వాత సోఫియా డంక్లీ మరియు వ్యాట్ లు ఇంగ్లండ్ ను కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో రెండవ ఇన్నింగ్స్ లో గార్డెనర్ తన స్పిన్ మాయతో మొత్తం 8 వికెట్లను కూల్చి ఇంగ్లాండ్ పతనాన్ని ఒక్కటే శాశించింది.
దీనితో ఇంగ్లండ్ 178 పరుగులకు ఆల్ ఔట్ అయ్యి… 89 పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ రాణించిన ఆల్ రౌండర్ గార్డెనర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకుంది.