క్రేజీ న్యూస్: “దేవర” మూవీ కోసం హైద్రాబాద్ లో భారీ సముద్రం సెట్…

-

జూనియర్ ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా దేవర. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది, తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం కథ ప్రకారం సముద్రం లో యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయట. ఆ సముద్రం కోసం నాచురల్ గా ఎందుకని.. మన హైదరాబాద్ లోనే ఒక సెట్ ను రెడీ చేశారట ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్. సెట్ అద్భుతంగా వచ్చిందని సినిమా యూనిట్ అంతా అనుకుంటున్నారట. ఈ సముద్రం సెట్ లోనే హీరో ఇంట్రడక్షన్ సీన్ మరియు కొన్ని యాక్షన్ సీన్ లను షూట్ చేస్తారట.

 

 

ఇవి సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. మరి ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్ లలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news