ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు..

అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తాయని సోమవారం భేటీ అయిన కేబినెట్‌ సమావేశంలో ప్రకటించింది. 2021 జనవరి నాటికి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది లేదని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు.

ఉద్యోగాల్లో ఇద్దరు పిల్లల నిబంధనకు సంబంధించి అసోం జనాభా, మహిళా సాధికారత విధానాన్ని అసోం అసెంబ్లీ 2017 సెప్టెంబరులోనే ఆమోదించింది. అయితే దీన్ని 2021 జనవరి నుంచి అమలు చేయాలని తాజాగా నిర్ణయించారు. జనాభా నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.